Monday, December 10, 2012

RAM లోపాలను టెస్ట్ చెయ్యడానికి..

మన కంప్యూటర్లో RAM ఫిజికల్ గా డామేజ్ అయితే తరచూ విండోస్, ఇతర సాఫ్ట్ వేర్లు క్రాష్ అవడం, సిస్టమ్ రీస్టార్ట్ అవడం వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ నేపధ్యంలో అసలు ఇప్పుడు మీ కంప్యూటర్ లో ఉన్న RAM Modules సక్రమంగా పనిచేస్తున్నాయో లేదా వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయో test చెయ్యడానికి MemTest అనే చిన్న ఉచిత ప్రోగ్రామ్ పనికొస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేశాక జిప్ ఫైల్ లో ఉండే Memtest.exe అనే ఫైల్ ని రన్ చేయండి. బాక్స్ లో All unused RAM అని ఉన్నప్పుడు, క్రింద Start Testing అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. RAM టెస్ట్ చెయ్యబోయే ముందు Word, Internet Explorer, Firefox వంటి అన్ని ప్రోగ్రాములు క్లోజ్ చేయండి. ఇకపోతే RAM టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా Alert వచ్చినట్లయితే టెస్టింగ్ పూర్తయ్యే వరకూ ఆగి, మరోమారు Testing రన్ చేయండి. మళ్లీ అదే దశలో Alert వస్తే RAMలోని ఆ ప్రదేశంలో ఫిజికల్ గా డామేజ్ అయినట్లు భావించాలి. ఇలా ఏదైనా alert వచ్చి RAM డామేజ్ అయిందన్న విషయం నిర్థారణకు వస్తే వెంటనే RAM మార్చుకోండి. లేదంటే ముఖ్యమైన డేటా లాస్ అవుతుంటుంది. 

No comments:

Post a Comment