Saturday, December 15, 2012

టోరెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా?


Featured Image

2. దానిని ఇంస్టాల్ చెయ్యండి. ఇది ఒకసారి చేస్తే సరిపోతుంది.
1. మన అవసరాన్ని బట్టీ ఒక Torrent Clientను ఎంచుకోవలి. కొత్తగా వాడేవారికి uTorrent ఐతే సరిపోతుందని నా అభిప్రాయం. ఇలా చాలా ఉన్నయి, కొన్నింటిని క్రింద పేర్కొన్నాను, అక్కడి నుండి వాటిని డౌంలోడ్ చేసుకొనవచ్చు.
Opera ఒక బ్రౌజర్, ఇందులో torrentలను కూడా డౌంలోడ్ చేయవచ్చు.
uTorrent ఐతే కేవలం 300KBలకన్నా తక్కువే ఉంటుంది.
3. మీకు కావలసిన డౌంలోడ్ కోసం క్రింద తెలిపిన ఏ వెబ్ సైట్లోనైనా లేదా గూగుల్లోనైనా వెతకవచ్చు.
ఒక వేళ మీరు గూగుల్లో సెర్చ్ చేయదలచితే మీరు వెతుకుతున్న పదానికి torrent అనే పదాన్ని జోడించి వెతకండి.
ఈ టోరెంట్లు డౌంలోడ్ చేసుకోవటానికి అది ఎవరి దగ్గరైనా ఉండాలి, మరియూ వారు దానిని సీడ్ చేసి ఉండాలి, సామాన్యంగా ఏదైన కొత్తది లేక బాగా పేరున్నది ఐతే దొరికే అవకాశం ఎక్కువ. ఉదాహరనకు కొత్త english సినిమా లేక హిందీ సినిమా లేక ఏదైనా హిట్ సినిమా. ఇవి ఉదాహరనకు తీసుకున్నానే తప్ప, కేవలం సినిమాలే దొరుకుతయన్నది నా ఉద్దేశం కాదు.
4. మీరు వెతికిన పదానికి సంబంధించిన టోరెంట్ దొరకగానే దాన్ని డౌంలోడ్ చెయ్యండి. ఇది సాధారనంగా 50KB కన్నా తక్కువగానే ఉంటుంది.కానీ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, ఇందులో seeds కనీసం ఒక్కటైనా ఉండాలి. Seedలు ఎందరున్నారనేది torrentను వెబ్ సైట్లో నుండి మీరు డౌంలోడ్ చేసుకొనేటప్పుడే చూసుకోవటం మంచిది, ఎలాగైనా మీ torrent client ఎన్ని seedలు ఉన్నాయనేది చూపిస్తుందనుకోండి, ఒకసారి చూసుకోవటం మంచిది.
5. మామూలుగా డౌంలోడ్ చేయమని క్లిక్ చేసిన వెంటనే డౌంలోడ్ చేసిన తరువాత ఏం చెయ్యలని అడుగుతుంది, మీరు ఇంస్టాల్ చేసిన ఆ torrent client సాఫ్ట్వేర్ తో ఓపెన్ చేయమనండి.
ఒక వేళ అడగకపోతే, దానిని మీరు సులభంగా గుర్తించదగ్గ ప్రదేశంలో సేవ్ చేసుకోండి. మీరు ఇంస్టాల్ చేసిన torrent clientను తెరిచి అందులోకి మీరిప్పుడే డౌంలోడ్ చేసిన టోరెంట్ ఫైల్ ను లాగివెయ్యండి(ఆ ఫైల్ ను క్లిక్ చేసి పట్టుకొని తెరిచి ఉన్న torrent client విండోలోకి తెచ్చాక వదలండి).
6.ఇక దానంతట అదే డౌంలోడ్ చేసేస్తుంది.

Tuesday, December 11, 2012

IP Address అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది

సాధారణంగా Home Users నుండి Commercial Users వరకు అందరు ప్రతీ రోజు వినే పదం IP Address. అసలు IP Address అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది? మనం సాధారణంగా ఒక మనిషిని గుర్తించడానికి గాని పిలవడానికి కాని అతని పేరుని ఉపయోగిస్తాము అలాగే నెట్ వర్క్ లో కనెక్ట్ అయి ఉన్న కంప్యూటర్ (Host) ని గుర్తించడానికి మనం ఉపయోగించే దానినే IP Address అంటారు.  అసలు ఒక నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ (Host) ని గుర్తించడానికి 3 రకాల మార్గాలు ఉన్నాయి.

1. కంప్యూటర్ పేరు (Computer Name)
2. MAC Address (Hardware Address)
3. IP Address
ఈ మూడు కుడా ప్రతి కంప్యూటర్ కి ప్రత్యేకమయినవి గా ఉంటాయి.  ఒక చోట ఉపయోగించిన తరువాత ఆ నెట్ వర్క్ మరే ఏ కంప్యూటర్ కి గాని మరే నెట్ వర్క్ Device కి గాని ఉపయోగించే అవకాశం లేదు అంటే ఒక సముదాయం లో ఏ ఇద్దరు వ్యక్తులకు ఒకే పేరు ఉంటే వారిని పిలిచేటపుడు  ఇలాంటి అయోమయ పరిస్తితి అయితే ఉంటుందో ఇక్కడ కూడా ఆలాంటి పరిస్తితే ఉంటుంది.  కాబట్టి ఒక చోట ఉపయోగించిన వీటిని అదే నెట్ వర్క్ లో వేరొక కంప్యూటర్ కి కాని నెట్ వర్క్ Device కి కాని ఉపయోగించే పరిస్తితి ఎత్తి పరిస్తితిలోను లేదు.
ఇక ఫై మూడు వాటిలో ఒక్కొక్క దాని కోసం వివరం గా తెలుసుకుందాం.

కంప్యూటర్ పేరు (Computer Name)
కంప్యూటర్ పేరు అనేది ప్రత్యేకంగా అన్ని రూల్స్ ఏమి లేక పోయిన నేమ్ పెట్టేటపుడు కొన్ని ప్రాధమిక సూత్రాలు పాటించ వలసి వస్తుంది. 
  • ఆ నెట్ వర్క్ ఉన్న ప్రతి కంప్యూటర్ కి లేదా ఇతర నెట్ వర్క్ Devices కి ప్రత్యేకంగా ఉండాలి.
  • కంప్యూటర్ పేరు 15 అక్షరాలు మించరాదు.
  • Space అనేది ఇవ్వ కోడదు అలాగే కొన్ని స్పెషల్ కేరెక్టర్స్ ఉపయోగించడానికి వీలు లేదు (/ \ * , . " @).
  • విండోస్ విస్టా కి ముందు కేవలం Upper case లో మాత్రమే ఇవ్వాలి అనే రూలే ఉండేది కానీ ఎప్పుడు ఆ నిబందన లేదు.  

MAC Address (Hardware Address):
A Media Access Control address (MAC address) 
అనేది హార్డ్ వేర్ అడ్రస్ ఇది మన కంప్యూటర్ లో ఉన్న Lan Card లో నిక్షిప్తమయి ఉంటుంది అది ప్రపచం లో ఉన్న ఏ రెండు నెట్ వర్క్ కార్డు లోను ఒకటిగా ఉండదు ప్రతి కార్డు ప్రత్యేక మయినది గా ఉండేటట్టు Institute of Electrical and Electronics Engineers (IEEE)  వారు జాగ్రత్తలు తీసుకుంటారు.  ఈ MAC అడ్రస్ నెట్ వర్క్ కార్డు తయారు చేసేటప్పుడు దాని లోని Read Only మెమరీ లో లోడ్ చేస్తారు కాబట్టి మనం దానిని చూడగలం కాని మార్పు చేయలేము. ఈ అడ్రస్  48bit సైజు తో Hexadecimal ఫార్మటు లో ఉంటుంది.


ఉదాహరణకు 01-23-45-67-89-ab   or  01:23:45:67:89:ab గా ఉంటుంది. 
ఒకవేళ కనుక  మన కంప్యూటర్ యొక్క MAC అడ్రస్ చూడాలి అనుకుంటే కనుక 
getmac
Ipconfig /all అనే కమాండ్లతో పొందవచ్చు.

IP Address:
IP అడ్రస్ అనేది 32bit Decimal number కలిగి 4 విభాగాలుగా ఉంటుంది. ప్రతి విభాగం 8bit కలిగి ఉంటుంది.

ఉదాహరణకు   203.48.16.43 అనే IP Address లో 
      8bit-8bit- 8bit-8bit = 32bit 

గమనిక:  ఇది IPv4 Version అదే IPv6 తీసుకుంటే 128bit అడ్రస్ కలిగి ఉంటుంది, దాని వివరాలు తరువాత తెలుసుకుందాం.  ప్రస్తుతానికి మనం ఎక్కువగా ఉపయోగించే IPV4 Version గురించి తెలుసుకుందాం. 
అంటే IP అడ్రస్ లో ప్రతి విభాగం 1byte  అంటే 8bit  గా ఉంటుంది.  అంటే IP అడ్రస్ 0-255 డెసిమల్ (Decimal) నెంబర్లు కలిగి ఉంటుంది. 

IP Address లో మనం ప్రధానం గా తెలుసుకోవలిసింది వాటి Classes కోసం IP Address 5 Classes గా ఉంటుంది.

Class Range
A 0.0.0.0         to   126.255.255.255
B 128.0.0.0     to    191.255.255.255
C 192.0.0.0     to    223.255.255.255
D 224.0.0.0     to    239.255.255.255
E 240.0.0.0     to    255.255.255.255

అసలు Classes ఏంటి ఈ Confusion ఏమిటి అనుకుంటున్నారా..?  ఏమి Confusion అవ్వద్దు, 
మనకు సాదారణంగా నెట్ వర్క్ లో LAN, WAN అనేవి ఉంటాయి.

LAN (Local Area Network) మనం పెద్ద పెద్ద definition లకు వెళ్ళకుండా సింపుల్ గా తెలుసుకుందాం.  LAN  అంటే దానిలో పేరులో ఉన్న విదంగా ఒక నెట్ వర్క్ లో ఉన్న లేదా Connect అయి ఉన్న కంప్యూటర్ ల సముదాయమునే LAN అనవచ్చు.  


ఇలా ఒక నెట్ వర్క్ లోని ఒక్క కంప్యూటర్ ని Host అని Workstation  అని పిలుస్తారు.

WAN  (Wide Area Network) అంటే కొన్ని నెట్ వర్క్ ల సముదాయం పైన మనం చెప్పు కున్న LAN లో కంప్యూటర్ లు అన్ని కలిసి ఉంటే అలాంటి రెండు అంత కంటే ఎక్కువ LAN లు కలిపితే ఒక WAN అవుతుంది.  

ఇలా WAN లో ఉన్నపుడు ఒక నెట్ వర్క్ లోని కంప్యూటర్ అదే WAN లోని వేరొక నెట్ వర్క్ లోని కంప్యూటర్ తో కనెక్ట్ అయి ఉన్నపుడు, ఏ కంప్యూటర్ ఏ నెట్ వర్క్ కి సంబందించిందో తెలుసు కోవాలి అంటే అలాంటి సందర్బాలలో ఈ క్లాసెస్ (Class) అనేవి ఉపయోగపడతాయి.  ఇక మీకు Confusion పోయిందని అనుకుంటా ఇక ఒక్కక క్లాసు గురించి వివరంగా తెలుసుకుందాం,
ఇలా ఉన్న నెట్వర్క్ Architecture ని బట్టి ఒక IP Address లో ఉన్న 4 విభాగాలలో కొన్ని నెట్ వర్క్ ని Represent  చేస్తే మిగతావి హోస్ట్ ని Represent చేస్తాయి.

Class A:
IP Address లో ఉన్న 4 విభాగాలలో (8bit. 8bit. 8bit. 8bit) మొదటి విభాగం (8bit-Network (N)) నెట్ వర్క్ కోసం మిగిలిన మూడు (8bit.8bit.8bi-Host (H-H-H)) ఆ నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ లేదా నెట్ వర్క్ Device లు కోసం కేటాయించ బడింది.
(N.H.H.H)  Network-Host-Host-Host

Class B:
IP Address లో ఉన్న 4 విభాగాలలో (8bit. 8bit. 8bit. 8bit) మొదటి రెండు విభాగాలు  (8bit-8bit Network (N-N)) నెట్ వర్క్ కోసం మిగిలిన  రెండు (8bit.8bit-Host (H-H)) ఆ నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ లేదా నెట్ వర్క్ Device లు కోసం కేటాయించ బడింది.
(N.N.H.H)  Network- Network -Host-Host

Class C:
IP Address లో ఉన్న 4 విభాగాలలో (8bit. 8bit. 8bit. 8bit) మొదటి మూడు  విభాగాలు  (8bit-8bit-8bit Network (N-N-N)) నెట్ వర్క్ కోసం మిగిలిన  ఒక్కటి  (8bit-Host (H))ఆ నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ లేదా నెట్ వర్క్ Device లు కోసం కేటాయించ బడింది.
(N.N.N.H)  Network- Network - Network –Host

Class D:
దీనిని Multicasting కోసం ఉపయోగిస్తారు.

Class E:
ఈ క్లాసు ఇంక వాడుక లోకి రాలేదు.

ఉదాహరణకు XX.YY.ZZ.AA అనేది ఒక IP Address అనుకుంటే 
Class A లో XX అనేది Network ID YY.ZZ.AA అనేది Host ID
Class B లో XX.YY అనేది Network ID ZZ.AA అనేది Host ID
Class C లో XX.YY.ZZ అనేది Network ID AA అనేది Host ID 

ఈ విధంగా మనం IP Address ని వివిధ సందర్భాలలో మన అవసరాన్ని బట్టి ఏ క్లాసు అనేది ఎంపిక చేసుకోవచ్చు.

ISP లు సాధారణంగా Class B ని ఉపయోగిస్తూ ఉంటారు.

ఫైర్ వాల్ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..?

 ఈ రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ అనేది బాగా ప్రాచుర్యం పొందింది అలాగే దానితో పాటు ప్రతి ఒక్కరిలో తన డేటా ను తన సిస్టం ని ఎలా కాపాడుకోవాలి అనే (భద్రతా ఎలా కల్పిచాలి అనే ఆలోచన పెరిగింది).  వీటి అన్నిటికి ఒకటే జవాబు అదే ఫైర్ వాల్ అంటే మనలో చాల మంది వేనె ఉంటాం "ఫైర్ వాల్  మన కంప్యూటర్ ని వెబ్ అటాక్స్ నుండి మరియు హకెర్స్ నుంచి రక్షణ కలిపిస్తుంది.

ఫైర్ వాల్  అంటే ఏమిటి ?
ఫైర్ వాల్ అనేది ఒక device  లేదా అప్లికేషను.  కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ద్వార జరిగే డేటా transferనిలువరిస్తుంది అసలు ఫైర్ వాల్ అనేది మన అనుమతి లేకుండా మన కంప్యూటర్ లోకి ఇంటర్నెట్ ద్వార ప్రవేసించే వాటిని నిలువరిస్తుంది.  సాదారణంగా ఫైర్ వాల్ అనేది రెండు రకాలు.
1 . హార్డువేర్ ఫైర్ వాల్ 
2 . సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్ 
హార్డువేర్ ఫైర్ వాల్  అనేది ఒక Device అది కంప్యూటర్ కి Modemకి మద్య అనుసందానం చేయబడి ఉంటుంది.  అంతే కాక కొన్ని Router ల లో ఇంటర్నల్ గా ఫైర్ వాల్ అనుసందానం చేయబడి ఉంటుంది.  ఇది ఇంటర్నెట్ ని షేర్ చేయడమే కాకా ఫైర్ వాల్ గా కుడా పని చేస్తుంది.
సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్  అనేది ఒక అప్లికేషను మన కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేయబడే అంటే ఇంటర్నెట్ ఏ సిస్టం కి అయితే Connect చేయబడి  ఉందొ ఆ సిస్టం లో ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది.  కొన్ని సందర్బాలలో ఇంటర్నెట్ మన నెట్ వర్క్  లోకి షేర్ చేసుకోవడానికి Router అందుబాటులో లేనపుడు ఈ కంప్యూటర్ నిRouter మరియు ఫైర్ వాల్ గా ఉపయోగించ వచ్చు. 
టూకిగా చెప్పాలి అంటే హార్డువేర్ ఫైర్ వాల్  అనేది ఇంటర్నెట్ కి మన నెట్ వర్క్ కి రక్షణ కవచంలా ఉంటుంది.  అదే సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్  అయితే కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కి మద్య రక్షణ కవచంలా ఉంటుంది.  ఎందుకు అంటే ఇంటర్నెట్ Modem నేరుగా కంప్యూటర్ కి అనుసందానం చేయబడి ఉంటుంది.

ఫైర్ వాల్ టెక్నాలజీస్ :

మనకి మార్కెట్లో చాలా రకాల ఫైర్ వాల్ Devices,  ఫైర్ వాల్ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి.  వాటిని రెండు రకాలుగా (Technically ) అంటే అవి పని చేసే విధానం పరంగా చూడటం జరుగుతుంది. 

a) ప్యాకెట్ ఫిల్టరింగ్ (Packet Filtering)
b) అప్లికేషను / Proxy ఫిల్టరింగ్ (Application/Proxy Filtering)

a) ప్యాకెట్ ఫిల్టరింగ్  
ఈ విదానం లో మన నెట్ వర్క్ ప్రతి ప్యాకెట్Analyze  చేసి అప్పుడు Send/ Receive  చేయబడుతుంది.  ప్రతి ప్యాకెట్ ప్రేత్యేకంగాAnalyze అంటే  ఆ ప్రోటోకాల్, సోర్సు మరియుdestination ports మరియు Direction  అన్నిటిని తన దగ్గర ఉన్న access కంట్రోల్ లిస్టు తో compare చేస్తుంది.  ఈ Access Listఅనేది కొన్ని ప్రత్యెక మయిన నిబందనలు (Rules ) తో ఉంటుంది.  అవి Firewall Configure చేసేటపుడు ఆ నిబందనలు(Rules)ఇవ్వబడతాయి.  కాబట్టి ఏ ప్యాకెట్ అయితే ఆ నిబంధనలు అన్నింటిని ఒప్పిచగలుగు తుందో ఆ ప్యాకెట్ మాత్రమే అనుమతించబడుతుంది.  ఇది కేవలం Receiving కి మాత్రమే కాదు Sendingకి కూడా ఇదే విధానం వర్తిస్తుంది.
ఉదాహరణకు: మనం Default బ్రౌజరు గా Internet Explorer ని Configure చేసామనుకొండి ఒక వేళHacking జరిగితే ఆ అప్లికేషన్ బ్లాక్ చేస్తుంది. 
ఈ విధానం వల్ల సెక్యురిటీ లాభాలు ఉన్నప్పటికీ Performance ప్రకారం కొన్ని లోపాలు ఉన్నాయి.  ఎందువల్ల అంటే మన కంప్యూటర్ లోకి వచ్చి వెళ్ళే ప్రతి ప్యాకెట్ సోదా చేయడం వల్ల Send/Receive చాలా ఆలస్యం అవుతుంది. అంతే కాక సామర్ధ్యం గల హాకెర్స్ చాలా సులువుగా హక్ చేసే అవకాశం ఉంటుంది.  అది ఎలా అంటే అతను పంపించే ప్రతి ప్యాకెట్ మాస్క్ చేసి పంపిస్తే చాల సులభంగా ఫైర్ వాల్ ని తప్పుపట్టించే అవకాశం ఉంది.

b) అప్లికేషను / Proxy ఫిల్టరింగ్
ఇంతకు ముందు చెప్పుకున్న విధానం లో మనంPackets Filtering ఎలా పని చేస్తుందో తెలుసుకున్నాము.  కాని ఈ విధానంలోFiltering అనేది అది పని చేసే విధానంలో కొంచెం మార్పులు ఉంటాయి.  ఇక్కడ ఫైర్ వాల్ అనేది ఒక స్టోరేజ్ యూనిట్ లా పని చేస్తుంది అంటే మన నెట్ వర్క్ లో ఏ ఒక్క కంప్యూటర్ కూడా నేరుగా ఇంటర్నెట్ తో నేరుగా సంభాదాలు కలిగి ఉండదు.  ఏది కావాలి అన్న మనం Proxy కి Requestచేస్తే అది ఇంటర్నెట్ తో నేరుగా అనుసంధానించబడి మనకు కావలిసిన ఇన్ఫర్మేషన్ అందిస్తుంది.  దీని వల్ల Proxy Server ఏ డేటా ని ప్రాసెస్ చేయాలి ఏది చేయకోడదు అనేది అని నిర్ణయిస్తుంది దాని వల్ల మనకు అవసరం లేని డేటా ని బ్లాక్ చేస్తుంది. 

ఫైర్ వాల్ చేయలేని పనులు
ఫైర్ వాల్ అనేది ఎంత గొప్పగా చెప్పుకున్న Security పరంగానూదాని లో కొన్ని లోపాలు ఉన్నాయి.
1.       Software Bugs: ఒక వేళ Security పరంగా సాఫ్ట్ వేర్ లో కొన్ని బగ్స్ ఉంటే దానిని ఫైర్ వాల్ ఏమి చేయలేదు.
2.       Human Error : మెషిన్ అనేది మనం Instuctions అనేవి కరెక్ట్ గా ఇవ్వక పోతే దానిని పూర్తి సామర్ధ్యంతో మనం ఉపయోగించుకోలేము.  ఉదాహరణకు: ఫైర్ వాల్ మనం సరిగ్గా Configureచేయక పోతే ఏమి చేయలేము.
3.       Virus : ఒకవేళ కంప్యూటర్ లో వైరస్ ఉన్నట్లయితే దానిని ఫైర్ వాల్ ఏమి చేయలేదు.  కాని కొన్ని సాఫ్ట్ వారే ఫైర్ వాల్ల్స్ Antivirus తో కలిపి వస్తున్నాయి.
4.       Inside Jobs : నెట్ వర్క్ లో internal గా జరిగే డేటా ఫ్లో కి ఫైర్ వాల్ కి సభంధం లేదు.

హార్డ్ వేర్ ఫైర్ వాల్ వలన ఉపయోగాలు:
1.       Security అధికం.
2.       System Resources చాలా తక్కువగా ఉపయోగించుకుంటుంది.
3.       అదనపు భద్రత కల్పిస్తుంది.
4.       హార్డ్ వేర్ ఫైర్ వాల్ చాలా నమ్మదగింది.
5.       Disable చేయడం Remove చేయడం చాల సులభం.
6.       వేరే కంప్యూటర్ మిద ఆధారపడదు స్వతంత్రంగా పని చేస్తుంది.

హార్డ్ వేర్ ఫైర్ వాల్ లోపాలు:
1.       Install చేయడం Configure చేయడం కొంచెం కష్టం తో కూడుకున్న పని.
2.       Physical గా స్థలం ఆక్రమిస్తుంది.
3.       కొంచెం ఖర్చుతో కూడుకున్న పని.
4.       Upgrade చేయడం కాని Repair చేయడం కొంచెం కష్టం.

సాఫ్ట్  వేర్ ఫైర్ వాల్ వలన ఉపయోగాలు:
1.       హార్డ్ వేర్ ఫైర్ వాల్ తో పోల్చుకుంటే చవకగా లభిస్తుంది.  కొన్ని సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్స్ ఉచితం గా కుడా లభిస్తున్నాయి.
2.       చాలా సులభంగా Upgrade చేసుకోవచ్చు.
3.       Physical గా కంప్యూటర్ లో కాని  నెట్ వర్క్ లో కాని ఏమి మార్పులు చేయలిసిన అవసరం లేదు.
4.       ఏది గృహ వినుయోగాదారులికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్ లోపాలు:
1.       Software Crash అవవచ్చు లేదా మీరు ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టం కి Compatibleకాకపోవచ్చు.
2.       Software bugs వలన కొన్ని సందర్భాలలో Security లోపించవచ్చు.
3.       సిస్టం Resources ఎక్కువగా ఉపయోగించుకుంటుంది కాబట్టి కంప్యూటర్ Performanceతగ్గవచ్చు.
ఏ ఫైర్ వాల్ ఎంపిక చేసుకోవాలి అనేది వినియోగదారుని యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది.  గృహ వినియోగదారులు అయిన, వాణిజ్య అవసరాలికి అయిన ఫైర్ వాల్ ఉపయోగించడం చాలా ఉపయోగకరమయిన విషయం. అలాగే ఇంటర్నెట్ షేరింగ్ కోసం ఉపయోగించే కొన్ని router   లలో కుడాHardware Firewall  అనుసంధానించబడి ఉంటుంది.  కాబట్టి అవి చూసి ఎంపిక చేసుకోగలిగితే హార్డ్ వారే ఫైర్ వాల్ కోసం పెట్టె ఖర్చుఅదా అవుతుంది.  ఇక సాఫ్ట్ వారే ఫైర్ వాల్ అయిన Zone Alarm వంటి కొన్ని ఫైర్ వాల్స్ ఉచితంగా లభిస్తున్నాయి.